Header Banner

అక్కడ 5 అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణలో నేటి వాతావరణ రిపోర్ట్! భారీగా మేఘాలు..

  Sun Feb 02, 2025 12:52        Environment

వారంలో మిగతా రోజులకూ, ఆదివారానికీ చాలా తేడా ఉంటుంది. ఈ రోజున చాలా మంది పర్యాటక ప్రదేశాలకో, ఊర్లకో వెళ్తుంటారు. అలా వెళ్లేవారికి ఈ రోజు వాతావరణం చాలా బాగుంటుంది. ఎందుకంటే.. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉన్నాయి. ఐతే.. భూమధ్య రేఖా ప్రాంతంలో మాత్రం 5 అల్పపీడనాలు ఉన్నాయి. వాటి ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై లేదు కానీ.. భారీగా మేఘాలు పోగవుతున్నాయి. అవి వచ్చేవారం.. తెలుగు రాష్ట్రాలవైపు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. మేఘాలు తక్కువగా ఉంటాయి. ఎండ దంచేస్తుంది. ప్రయాణాలు చేసేవారు.. ఎండ నుంచి ఉపశమనం పొందేలా జాగ్రత్తపడాలి. బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ తీసుకెళ్లాలి.

 

ఇంకా చదవండి: బాబా రామ్‌దేవ్, బాలకృష్ణకు కేరళ కోర్టు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ! కారణం ఇదే!

 

బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి 25 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకి 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకి 12 కిలోమీటర్లుగా ఉంది. ఈ మాత్రం గాలి వీచకపోతే, ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. ఐతే.. తెలంగాణలో గాలి వేగం కొద్దిగా పెరుగుతోంది. ఉష్ణోగ్రత చూస్తే.. తెలంగాణలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో ఏకంగా 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఎండలు దంచేస్తున్నాయి. ఉదయం వేళ కాస్త చల్లగా ఉంటుంది కానీ.. 10 గంటల తర్వాత నుంచి వేడిగానే ఉంటుంది. తేమ బాగా తగ్గిపోయింది. తెలంగాణలో 30 శాతమే ఉంది. ఏపీలో కూడా 35 శాతమే ఉంది. తేమ తగ్గితే వేడి పెరుగతుంది. చలి కూడా తగ్గిపోతుంది. మొత్తంగా ఇవాళ వీకెండ్ ప్రయాణాలు పెట్టుకున్నవారికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather